కాశీబుగ్గ, మే 11 : ఆదివారం విడుదలైన ఎప్‌సెట్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి సత్తాచాటాడు. గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కాశీబుగ్గ ఓ-సిటీకి చెందిన చాడ అక్షిత్ ఎప్‌సెట్(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు సాధించి తన ప్రతిభ చూపాడు. అక్షిత్ 1వ తరగతి నుంచి 5 వరకు ప్లాటినం హైస్కూల్లో, 6 నుంచి 10 వరకు హంటర్‌రోడ్డులోని తేజస్వి హైస్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల లో చదివాడు. ఇంటర్లో వెయ్యి మార్కులకు 992 మా ర్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్షిత్‌ను తల్లిదండ్రు లు కిరణ్‌కుమార్, వీరలక్ష్మి, సోద రి, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అక్షిత్ తండ్రి కిరణ్‌కుమార్ స్టేషన్‌రోడ్డులో మెడికల్ షా పు నిర్వహిస్తున్నాడు. తల్లి గతంలో యాక్సిస్ బ్యాంక్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసినట్లు తెలిపారు.
డాక్టర్ కావాలన్నదే నా కల..
ఇటీవల నిర్వహించిన నీట్లో మంచి మార్కులు సాధించి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మెడికల్ కళాశాలలో సీటు సాధిస్తా. నా లక్ష్యం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సీటు సాధించడమే. చిన్ననాటి నుంచి కష్టపడి చదివాను. డాక్టర్ కావాలన్నది నా కల. తప్పకుండా అది నెరవేరుతుంది. డాక్టర్ అయిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తా. తల్లిదండ్రుల సహకారం మరువలేనిది.
జనగామ విద్యార్థిని సాయి సంయుక్తకు 64వ ర్యాంక్..
జనగామ, మే 11 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్(అగ్రికల్చర్-ఫార్మసీ) విభాగంలో జనగామ జిల్లాకేంద్రానికి చెందిన బొగ్గారపు సాయి సంయుక్త రాష్ట్రస్థాయిలో 64వ ర్యాంకు సాధించింది. బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన సంయుక్త అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నది. నీట్లో మంచి ర్యాంకు సాధించి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి లేదా ఎయిమ్స్‌లో మెడిసిన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.