వరంగల్, జూలై 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారిక యంత్రాంగంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రెవెన్యూ డివిజన్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా, తహసీల్దార్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. నగర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు.