డోర్నకల్, జనవరి 8 : రైల్వే అధికారినంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి డోర్నకల్‌కు చెందిన ఓ సెల్పాయింట్ వ్యాపారి మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్‌లోని పద్మావతి సెల్ పాయింట్ వ్యాపారి అభిషేక్ జైన్‌కు గతేడాది డిసెంబర్ 24న ఒక వ్యక్తి ఫోన్ చేసి తన పేరు శ్రీనివాస్‌రావు అని రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తానని ఒక ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కావాలని అడిగాడు. వివరాలను వాట్సాప్‌లో వివరాలు కూడా పెట్టాడు. దీనికి వ్యాపారి వివో వి40 ఫోన్ ఖరీదు రూ.35 వేలు ఉంటుందని చెప్పాడు.
మొదట వ్యాపారి బ్లూకలర్ ఫోన్ తెప్పించగా, లేదు నాకు పర్పుల్ కలరే కావాలనడంతో అదే తీసుకొచ్చి షాప్ పెట్టాడు. తర్వాత అతడికి కాల్ చేసి సార్ ఫోన్ తెచ్చాను.. తీసుకెళ్లండి అని చెప్పాడు. కానీ అతడు షాప్‌కు రాకుండా ‘నేను రైల్వేస్టేషన్లో బిజీగా ఉన్నాను.. మీరు సెల్‌ఫోన్ తీసుకొని రండి.. అమౌంట్ ఇచ్చి ఫోన్ తీసుకుంటా’ని చెప్పాడు. నిజమేనని నమ్మిన వ్యాపారి.. రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి సార్ బిజీగా ఉన్నారు.. ఇవి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ పట్టుకోండి.. మీరు ఫోన్ ఇస్తే సార్‌కు చూపించి వస్తానని ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ అతడు తిరిగిరాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. ఈమేరకు బాధితుడు అభిషేక్ జైన్ ఆర్పీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.