జనం గుండెల్లో గులాబీ
బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరించారు.
- ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
- పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి, దేశానికి దిక్సూచిగా నిలిపిందన్న నేతలు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శ్రేణుల సంబురాలు
నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 27 ; బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పాల్గొని గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడుపోసున్న గులాబీ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాల గుండెల్లో నిలిచిపోయిందని.. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా నిలిపిందని నేతలు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హనుమకొండలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ జెండా ఎగురవేయగా, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ ఎం.సుధీర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. జనగామ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్యతో కలిసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, జయశంకర్ భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వెంకటరమణారెడ్డి, ములుగులో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావుతో కలిసి మహబూబాబాద్ ఎంపీ కవిత గులాబీ జెండా ఆవిష్కరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

