వైభవంగా సద్దుల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
- పెదమడూరు, ధర్మగడ్డతండాలో రెండు రోజుల ముందే వేడుకలు
- ఉత్సాహంగా ఆడిపాడిన ఆడబిడ్డలు
- అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- తెలంగాణ సంస్కృతిని పరిరక్షించుకోవాలని
పిలుపుదేవరుప్పుల, అక్టోబర్ 20 : తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ వేడుకలు మండలం లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిఏటా ఆనవాయితీ ప్రకారం పెదమడూరు, ధర్మగడ్డతండాలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో శుక్రవారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి ఆడిపాడారు. పెదమడూరుకు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు, ప్ర ముఖ పారిశ్రామిక వేత్త బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్ భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ లైట్ల వెలుగుల్లో ప్రతి వీధిలో ఎల్ఈడీ టీవీ తెరలు అమర్చారు.
గ్రామంలోని ఊర చెరువు వద్ద మహిళలు బతుకమ్మలాడుతుండగా సిరీస్ లైట్ల కాంతులతో ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 10 ఫీట్ల ఎత్తు ఉన్న బతుకమ్మ పేర్చడం హైలైట్‌గా నిలిచిం ది. దశాబ్దకాలంగా ఇంతటి భారీ ఏర్పాట్లను తాము చూడలేదని గ్రామస్తులు తెలిపారు. ఘనంగా జరిగిన వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బస్వ సావిత్రి, పెదమడూరు సర్పంచ్ సుజనారెడ్డి, ఎంపీటీసీ గిరి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ పెద్దారెడ్డి, ఉప సర్పంచ్ మానుపాటి వెంకటేశ్వర్లు, జోగు భిక్షపతి, మాటకోడూరు శ్రీనివాస్‌శర్మ, రవీందర్‌రెడ్డి, సంజీవరెడ్డి, కృష్ణ, బీఆర్ఎస్ గ్రామఅధ్యక్షుడు రాములు, సంపత్, మండల అధ్యక్షుడు దయాకర్, నాయకులు సుందరరాంరెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

