నల్లబెల్లి, ఏప్రిల్ 29 : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు వంద శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సీడీపీఓ మధురిమ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లకు నెలవారి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మధురిమ హాజరై అంగన్వాడీ కేంద్రాలలో హక్కుదారులు వంద శాతం హాజరు ఉండాలన్నారు.
ఫుడ్ స్టాక్ ఎక్స్ పైరీ తేదీలు తప్పని సరిగా చెక్ చేసుకొన్న తర్వాత బయోమెట్రిక్ వేసి ఫుడ్ స్టాక్ తీసుకోవాలన్నారు. గుడ్లు సరఫరా అయిన 10 రోజుల్లోగా ఉపయోగించాలని ఆదేశించారు. అదేవిధంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణతో పాటు నల్లబెల్లి సెక్టార్, రుద్రగూడెం సెక్టార్లలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.