కాశీబుగ్గ, నవంబర్ 10 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్, జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
పత్తి మిల్లులకు ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో సీసీఐ కఠిన నిబంధనలు పెట్టి, రైతుల అవస్థలకు గురిచేస్తున్నదని ఆరోపించారు. దీంతో రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, వివిధ కార్మిక వర్గాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు, మార్కెట్లలో నిరవధికంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సీసీఐకి సంబంధించిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయరని పేర్కొన్నారు.