ఖిలావరంగల్, అక్టోబర్ 11 : అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యం త్రంగా ఆయా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో లా అండ్ ఆర్డర్-1లో భాగంగా 69 మందిని బైండోవర్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పీ ప్రావీణ్య తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ కింద పబ్లిక్ ప్రాపర్టీపై రాసిన 4111 వాల్ రైటింగ్, 5318 వాల్ పోస్టర్లు, 3619 బ్యానర్లు, ఎన్నికల కోడ్ నిబంధనలోకి వచ్చే రాతలను 13,940 గుర్తించి వాటికి రంగులు వేసి తొలగించినట్లు తెలిపారు. అలాగే అక్రమ మద్యం దుకాణాలు, మద్యం తరలిస్తున్న శిబిరాలపై దాడులు చేసి, 1,797 లీటర్ల మద్యంను సీజ్ చేసి 20 కేసులు నమోదు 13 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.