నిరుద్యోగుల ద్రోహి రేవంత్రెడ్డి
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి సెకండ్ గేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు.
- పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి
- కేయూలో ఏబీఎస్ఎఫ్, పోలీస్ అభ్యర్థుల నిరసన
హనుమకొండ చౌరస్తా, జూన్ 11 : నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి సెకండ్ గేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు.
అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాలు కాకుండా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులకు 36, ఎస్సైకి 38 ఏళ్ల వయోపరిమితి ఇవ్వాలన్నారు. నిరుద్యోగ యువతకు సీఎం అన్యాయం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధార సురేశ్, కేయూ అధ్యక్షుడు అడ్డ రాజేశ్, ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్, రణధీర్, ప్రణయ్, పవన్, కార్తీక్, వేణు, సాయికిరణ్, వెంకటేశ్, సూర్య, పోలీస్ అభ్యర్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

