రాయపర్తి : నర్సంపేట డిపో నుండి మండలంలోని కొండాపురం గ్రామం మీదుగా తొర్రూరుకు నూతనంగా ప్రారంభమైన ఆర్డినరీ బస్సు సర్వీసును(Bus service) ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కొండాపురం గ్రామ మాజీ సర్పంచ్ బొంపల్లి వెంకట్రావు కోరారు. బుధవారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్తులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. వెంకటరావు మాట్లాడుతూ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మికి పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ఆమె బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నర్సంపేట డిపో నుండి ఉదయం బయలుదేరిన బస్సు చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, అన్నారం షరీఫ్ ల మీదుగా ఉదయం 7 గంటలకు కొండాపురం వస్తుందని, కొండాపురం నుండి మండలంలోని ఊకల్, బాల్ నాయక్ తండ, సన్నూరు, వెంకటేశ్వర పల్లి నుండి తొర్రూర్ చేరుకుంటుందన్నారు. మళ్లీ ఇదే మార్గంలో నర్సంపేటకు వెళుతుందని వివరించారు. బస్ సౌకర్యాన్ని ప్రజలంతా వినియో గించు కోవాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమలో తెరాల యాకయ్య, ఎనగందుల మురళి, పిన్నింటి సోమేశ్వరరావు, కేశబోయిన దూడయ్య, పున్నం బ్రహ్మం, ఎర్రబెల్లి వెంకట్రావు, పెద్దగోని సంతోష్ కుమార్, నూనె సుమన్, బొమ్మగాని రవి, ఎర్రబెల్లి నరేందర్ రావు, ఎండీ ఖదీర్, అంగిరేకుల మధుకర్ తదితరులున్నారు.