వర్ధన్నపేట, మార్చి 11: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా భగ్గుమన్నది. ఆయన మాటలకు నిరసనగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మార్గం భిక్షపతి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయాలనే కుట్రతోనే ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసును అంటగడుతున్నారని మండిపడ్డారు. ఈడీ సహాయంతో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారు. బండి సంజయ్ అర్థం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రజల చేతిలో ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్‌పై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మండల ఎన్నికల ఇన్చార్జి సుదర్శన్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు సిలువేరు కుమారస్వామి, కొండేటి శ్రీనివాస్, పూజారి రఘు, తిరుపతి సురేష్, హన్మకొండ సుధాకర్, పెద్దబోయిన దేవేంద్ర, బొచ్చు జ్యోతి పాల్గొన్నారు.
బండి సంజయ్‌పై స్టేషన్లో ఫిర్యాదు
సంగెం/కాశీబుగ్గ: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగెంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలిలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ యూత్ నాయకుడు బండి సంజయ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాబు, వైస్‌ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీటీసీ మల్లయ్య, బీఆర్ఎస్ యూత్ నాయకులు పెండ్లి పురుషోత్తం, పోశాల ప్రవీణ్, రమేశ్‌బాబు, రాజేశ్, సర్పంచ్ కావటి వెంకటయ్య, కోడూరి సదయ్య, కాగితాల జగన్నాథాచారి, నల్లతీగల రవి, మునుకుంట్ల మోహన్, కన్నెబోయిన స్వామి, వాసం సాంబయ్య, ఎలుగోయ లింగయ్య, పురం శ్రీనివాస్, భరత్‌రెడ్డి, బాబు రమేశ్, గోపి, అశోక్, సాంబరాజు, ప్రమోద్, వెంకన్న, ప్రశాంత్, వెంకటేశ్, అఖిల్ పాల్గొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాశీబుగ్గ సెంటర్లో శనివారం రాత్రి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి వరంగల్ తూర్పు అధ్యక్షుడు సోనీబాబు మాట్లాడుతూ బండి సంజయ్ మహిళలను కించపరుచడం సరికాదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ముష్కె ప్రమీల, కుసుమ నరేశ్, జెక్కి యుగేంధర్, కుమార్, సంపత్, కిన్నెర రంజిత్ పాల్గొన్నారు.
మండలంలో నిరసనల వెల్లువ
పర్వతగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్ తెలిపారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో మహిళలపై బీజేపీ వైఖరి తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. ఎంపీ హోదాలో ఉండి ఒక ఉద్యమకారిణి, ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితెందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ రంగు జనార్దన్‌గౌడ్, బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు బరిగెల విజయ, మాజీ సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్, పార్టీ గ్రామ అధ్యక్షుడు మేరుగు వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి సభ్యులు జూలపెల్లి దేవేందర్‌రావు, సముద్రాల రాజన్న, బీఆర్ఎస్ నాయకులు చీమల భిక్షపతి, దొనికె కొమురయ్య, రాజు, జంగ సాంబయ్య, బర్ల రాజశేఖర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాల్గొన్నారు.