నల్లబెల్లి, ఏప్రిల్ 06 : ఔట్ సోర్సింగ్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ రెన్యువల్ సమయం అయిపోయిందని గతంలో పనిచేసిన కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. జిల్లా దవాఖానలో కొత్తగా మంజూరైన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టుల్లో సీనియార్టీ ప్రకారం వీరిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులను జిల్లా దవాఖానలో తీసుకోవాలని జీవో 45 (2022) ఉన్నా రాజకీయ ఒత్తిడితో అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
జిల్లా దవాఖానలో కొత్తగా రిక్రూట్ చేసే పోస్టుల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా నియమించాన్నారు. నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్లో గత 20 సంవత్సరాల నుండి విధులు నివర్తిస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా హాస్పిటల్లో విధులను నిర్వర్తించేందుకు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ తోపాటు డీఎంఈలు స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే బాధితులకు అండగా బీఆర్టీయూ జిల్లా కమిటీ ఉంటుందని స్పష్టం చేశారు.