రాయపర్తి, నవంబర్ 29: స్వరాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమానికి దీక్షా దివస్ ఊపిరిలూదిన రోజుగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని లిఖించుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్‌లోని నానీ గార్డెన్స్‌లో జరిగిన దీక్షా దివస్‌లో పాల్గొనేందుకు మండలంలోని 40 గ్రామాల బీఆర్ఎస్ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీగా తరలివెళ్లారు. మోటార్ సైకిళ్ల ర్యాలీని మండలకేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా బైక్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కరీంనగర్ జిల్లా వేదికగా ఉద్యమ రథసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధమవుతున్న క్రమంలో నాటి ఆంధ్రా పాలకులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో తెలంగాణ ఉద్యమం మహోగ్రరూపాన్ని సంతరించుకున్నదని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, ఆకుల సురేందర్‌రావు, గారె నర్సయ్య, పూస మధు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, అయిత రాంచందర్, ముద్రబోయిన సుధాకర్, మహ్మద్ అక్బర్, చందు రామ్‌యాదవ్, ఉబ్బని సింహాద్రి, అయిత రవి, మధు పాల్గొన్నారు.
కరీమాబాద్/నర్సంపేట/వర్ధన్నపేట/గీసుగొండ/దుగ్గొండి: వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు చోట్ల ఉద్యమకారులు శుక్రవారం దీక్షా దివస్ చేపట్టారు. తిమ్మాపూర్ క్రాస్ వద్ద 43వ డివిజన్‌కు చెందిన ఉద్యమకారులు దీక్షా దివస్ నిర్వహించారు. ఉద్యమకారులకు 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జయశంకర్, ఇల్లందుల రవి, మ్యాకల సూరయ్య, క్రాంతి సదన్న, సాంబన్న, ప్రభాకర్, జగపతి, కిరణ్, శేఖర్, ఉదయ్, గోవర్ధన్, గౌస్ పాల్గొన్నారు. ఉర్సు చెట్లవారిగడ్డ వద్ద వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా దివాస్‌కు కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సిద్ధం రాజు మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో మరుపల్ల రవి, మేకల ఎల్లయ్య, అంకం దేవానంద్, కెంచ ఆనంద్, ప్రమీలాదేవి, తాళ్ల ఉమాదేవి, పప్పుల మంజుల, వనం కుమార్ పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గ్రామాల్లో దీక్షా దివస్‌ను జరుపుకున్నారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు వరంగల్ నానీ గార్డెన్స్‌లో జరిగిన దీక్షా దివస్‌కు తరలివెళ్లారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి ఆధ్వర్యంలో వర్ధన్నపేట పట్టణంతోపాటు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. వరంగల్‌కు తరలివెళ్లిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, కోమాండ్ల ఎలేందర్‌రెడ్డి, గోపాల్‌రావు, యుగేంధర్‌రావు, కొండేటి శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, సురేశ్, రాజమణి, ఉమాదేవి, వెంకన్న పాల్గొన్నారు.
గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ నేతలు దీక్షా దివస్‌లో పాల్గొనేందుకు వరంగల్‌కు తరలివెళ్లారు. నాయకులు పోగుల యుగేంధర్, మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, నాయకులు సుంకరి శివకుమార్, శ్రీకాంత్, రాజేందర్, ప్రమోద్, రాజేందర్, రాజు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు వరంగల్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, నాయకులు శానబోయిన రాజ్‌కుమార్, ఊరటి మహిపాల్‌రెడ్డి, పొన్నం మొగిలి, కాట్ల భద్రయ్య, కే శ్రీనివాస్‌రెడ్డి, రజినీకర్‌రెడ్డి, పిండి కుమారస్వామి, బూర చందూగౌడ్ పాల్గొన్నారు.
వరంగల్: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పి న రోజుగా దిక్షా దివస్ గుర్తుండి పోతుందని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకుడు ఎండీ మసూద్ అన్నారు. వరంగల్ బల్దియా కార్యాలయ ఆవరణలోని దీక్షా దివస్ పైలాన్ వద్ద ఉద్యమకారులు జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలు చేశారు.