వర్ధన్నపేట/తొర్రూరు, జనవరి 31: ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ ఆ నోటీసులకు జంకదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని 3వ వార్డు, జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి, మహబూబాబాద్ జిల్లా తొ ర్రూరు పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. హోటళ్లు, పాన్‌షాపులు, ఇతర దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. బజ్జీలువేసి, పాన్లు కట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచా రు.
అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇష్టానుసారంగా హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ విశేషం గా కృషి చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడా బిడ్డల హకులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. మహిళలకు పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరెల విషయంలో సుమారు రూ.450 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా అండగా నిలిచారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడంలో దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందని విమర్శించారు. విద్యార్థులకు సూటీలు ఇస్తామన్న హామీ అమలు కాలేదని, రైతుబంధు, రైతు బోనస్ ఎగ్గొట్టారని అన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ కూడా గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి పట్టణ వాతావరణం తీసుకువచ్చేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మరో రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికాంరలోకి రాగానే అభివృద్ధి పనున్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, తొర్రూరులో మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాటోత్ సుందర్, జ్యోతి, సాయి, భాస్కర్, హుము, యుగేంధర్ బీఆర్ఎస్లో చేరగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, నాయకులు సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, ఎలేందర్‌రెడ్డి, తోటకూరి రాజమణి, గుజ్జ వీరన్న, గోదుమల మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు.