ప్రియుడి మోజులో పడి.. భర్త, అత్త హత్యకు కుట్ర
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తతో పాటు అత్తను అంతమొందించేందుకు పథకం వేసింది. ఎస్సై సుస్మిత కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మొదక్పల్లిలో పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. సోనీ ప్రియుడి మోజులో పడి తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించి వారిని చంపాలని పథకం వేసింది.
- మీల్మేకర్ కూరలో గడ్డి మందు కలిపి ఇవ్వడంతో అస్వస్థత
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
ఖలీల్‌వాడి, ఆగస్టు 3 : ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తతో పాటు అత్తను అంతమొందించేందుకు పథకం వేసింది. ఎస్సై సుస్మిత కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మొదక్పల్లిలో పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. సోనీ ప్రియుడి మోజులో పడి తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించి వారిని చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో శనివారం మీల్మేకర్ కూర వండిన సోనీ.. అందులో గడ్డి మందు కలిపింది. మధ్యాహ్నం భోజనం చేసిన భూదేవికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.
భూమన్నకు కూరలో పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అప్పటికే తల తిరుగుతుండడంతో భూమన్న, భూదేవిని నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై సుస్మిత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

