దుగ్గొండి, మార్చి, 16 : దుగ్గొండి మండలంలోని కేశవపురం బీఆర్ఎస్(BRS) గ్రామ శాఖ అధ్యక్షుడు బొంతల సాయికుమార్ (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి పెంచికల పేటకు గ్రామానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట యువజన విభాగం కన్వీనర్ శానబోయిన, మండల పార్టీ అధ్యక్షుడు సూకినే రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, రాజకుమార్, పొగాకు బాలకృష్ణ, మోహన్ రావు, మాలగాని రమేష్, అంబిర్ రమేష్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పాల్గొన్నారు.