జయశంకర్ భూపాలపల్లి : కేంద్రం నిర్దేశించిన కోటా ( Centre Quota ) మేరకే ధాన్యం కొనుగోలు( Paddy Procure ) చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ భూపాలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ( BRS Protest ) , ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా, కేంద్రం తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎరువుల యాప్ను పక్కనపెట్టి నేరుగా రైతులకు ఎరువులు అందించాలన్నారు. ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రైతుబంధుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు.