Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (AK47) నుంచి చిత్రబృందం మరో ఆసక్తికర గ్లింప్స్‌ను విడుదల చేసింది. రోజుకో కొత్త వీడియోతో సినిమా ప్రచారాన్ని వేగవంతం చేస్తున్న మేకర్స్, తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషిస్తున్న ‘స్వర్ణ’ పాత్రను పరిచయం చేస్తూ సరికొత్త గ్లింప్స్‌ను పంచుకున్నారు.
ఈ ఆడాళ్లకి ఆటీట్యూడ్ తప్ప గ్రాటీట్యూడ్ ఉండదంటూ త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, వినోదాత్మక ఘట్టాలతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.