కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. అతని భార్య తీవ్రంగా గాయపడింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని రాజమహేంద్రవరం పట్టణానికి చెందిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావు సోదరుడు నున్నా సురేశ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన అతని భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నున్నా సురేశ్ దంపతులు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.