ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. చిన్నగూడురు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం మరిపెడలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను పదిలక్షల మందితో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
- ఎల్కతుర్తి సభకు 10 వేల మందిని తరలించాలి
- డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
- 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక
మరిపెడ, ఏప్రిల్17: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. చిన్నగూడురు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం మరిపెడలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను పదిలక్షల మందితో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు మండలాల నుంచి 10 వేల మంది హాజరు కావాలని కోరారు. నాయకులు గ్రామాల్లో పర్యటించి సభ ప్రాముఖ్యతను కార్యకర్తలకు తెలియజేస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చి నా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని వీరారం రెవెన్యూ పరిధిలోని వెంకట్నాయక్ తండా, బోత్తల తండాకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్యానాయక్ సమీక్షలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు రామడుగు అచ్యుత్ రావు, గుగులోత్ వెంకన్న, రాంసింగ్, తాళ్లపల్లి శ్రీనివాస్, గాదె అశోక్ రెడ్డి, మాణి క్యం, రాంబాబు, రవీందర్, చెన్నారెడ్డి, ఉప్పుల నాగేశ్వర్రావు, కోఅప్షన్ మాజీ మెంబర్ అయూబ్ పాషా, లతీఫ్, కాలూనాయక్, బాలాజీ, ఉపేందర్, పిట్టల ధనంజయ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

