హసన్‌పర్తి, ఏప్రిల్ 13 : ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పండుగను తలపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. లక్షలాదిగా ప్రజలను తరలించి విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని దయాకర్‌రావు నివాసంలో ఆదివారం గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్ అధ్యక్షతన 1, 2వ డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులే శ్రీరామ రక్షగా ఉంటాయన్నారు. పార్టీకోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
రానున్న స్ధానిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. సాగు నీరు, కోతలు లేని కరెంట్, రైతుబంధు, రైతు బీమా అందించిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతు భరోసా ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సూచించారు. సమావేశంలో కార్పొరేటర్లు రవినాయక్, ఇండ్ల నాగేశ్వర్రావు, ఇన్చార్జి రాంమూర్తి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గండు అశోక్‌యాదవ్, జిల్లా నాయకులు గనిపాక విజయ్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పార్కింగ్ స్థలాల పరిశీలన
రజతోత్సవ సభ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చే వాహనాలను పార్కింగ్ చేయడం కోసం మండలంలోని అనంతసాగర్, మడిపల్లి గ్రామ శివారులోని స్థలాలను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి దయాకర్‌రావు ఆదివారం పరిశీలించారు. వారి వెంట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాడి మాల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజినీకుమార్, మాజీ ఎంపీటీసీ ఇంద్రయ్య, గ్రామ పారీ ్టఅధ్యక్షుడు రాజు తదితరులు ఉన్నారు.