హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 4 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు ముమ్మరం చేశారు. అంకురార్పణ జరిగిన తెల్లారి నుంచే పది డోజర్లు, ఐదు ఎక్స్కవేటర్ల సహాయంతో భూమి చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సభా స్థలితో పాటు పార్కింగ్ స్థలాల్లో ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. శుక్రవారం నుంచి సభా పనులు ఊందుకున్నాయి.
ఉదయాన్నే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు సతీశ్ కుమార్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, నిమ్మగడ్డ వెంక న్న,రాఘవ పనులను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా రజతోత్సవ వేడుకలు నిర్వహించే స్థలం నిర్ధారణ కావండంతో అనేక మంది సందర్శించి వెళ్తున్నారు.