ఖానాపురం/రాయపర్తి, డిసెంబర్ 23: ఉపాధిహామీ పథకంలో నిర్మించిన కల్లాల డబ్బులను వెంటనే వెనక్కి చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాకు మండలకేంద్రం నుంచి శ్రేణులు తరలివెళ్లాయి. ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ తుంగబంధం చైర్మన్ వేజళ్ల కిషన్‌రావు, సర్పంచ్‌లు ప్రవీణ్‌కుమార్, ఐలయ్య, సుమన్, వెంకన్న, ఉప్పు వెంకటేశ్వర్లు, పూర్ణచందర్రావు, బందారపు శ్రీను, రమేశ్, ఉపసర్పంచ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే, బీఆర్ఎస్ రాయపర్తి మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు, పీఏసీఎస్ సంఘాల ప్రతినిధులు, అనుబంధ కమిటీల నాయకులు ప్రత్యేక వాహనాల్లో వరంగల్‌కు తరలివెళ్లారు. జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు గారె నర్సయ్య, గట్టు నర్సింహాచార్యులు, కోదాటి దయాకర్‌రావు, అయిత రాంచందర్, కుందూరు రాంచంద్రారెడ్డి, పూస మధు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, తేరాల యాకయ్య, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, ఎద్దు రమేశ్, బద్ధం రంగారెడ్డి, గూడెల్లి శ్రీనివాస్, ఉబ్బని సింహాద్రి, లేతాకుల యాదవరెడ్డి, బిల్ల సుభాష్‌రెడ్డి, అబ్దుల్ పాల్గొన్నారు.