OTT Releases This Week | ‘పెద్ది’ నుంచి ‘సింగ్ గీతం’ వరకు.. ఈ వారం ఓటీటీలో బ్లాక్‌బస్టర్ ఎంటర్టైన్మెంట్!
OTT Releases This Week | ఈ వారం సినీ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ సిద్ధమైంది. ఒకవైపు థియేటర్లలో అఖిల్ అక్కినేని నటించిన రూరల్ మాస్ ఎంటర్టైనర్ లెనిన్ తో పాటు మలయాళ డబ్బింగ్ మూవీ 'ఐ నోబడీ', మైథలాజికల్ ఎపిక్ 'వసుదేవసుతం', తమిళ డబ్బింగ్ లవ్ స్టోరీ 'లవ్ ఓ లవ్' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా... మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా భారీ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి.
OTT Releases This Week | ఈ వారం సినీ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ సిద్ధమైంది. ఒకవైపు థియేటర్లలో అఖిల్ అక్కినేని నటించిన రూరల్ మాస్ ఎంటర్టైనర్ లెనిన్ తో పాటు మలయాళ డబ్బింగ్ మూవీ ‘ఐ నోబడీ’, మైథలాజికల్ ఎపిక్ ‘వసుదేవసుతం’, తమిళ డబ్బింగ్ లవ్ స్టోరీ ‘లవ్ ఓ లవ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా… మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా భారీ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘పెద్ది’ డిజిటల్ ప్రీమియర్ ఈ వారంలోనే ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం సింగ్ గీతం. ఈ సినిమా కూడా జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తమిళంలో విడుదలై ప్రశంసలు అందుకున్న డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘పరిమళ అండ్ కో’ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయరాం, ఊర్వశి, అనంతిక సానిల్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. జులై 10 నుంచి జీ5లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. జులై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం ఓటీటీ రిలీజ్‌ల పూర్తి జాబితా చూస్తే.
నెట్‌ఫ్లిక్స్..
పెద్ది – తెలుగు సినిమా (జులై 9)
సింగ్ గీతం – తెలుగు సినిమా (జులై 9)
ఇక్కా – తెలుగు డబ్బింగ్ సిరీస్ (జులై 10)
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ – ఇంగ్లీష్ మూవీ (జులై 8)
నథింగ్ టూ లూజ్ – ఇంగ్లీష్ మూవీ (జులై 8)
సల్సేడో, లెదర్ అండ్ బొగాలో (జులై 8)
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే – ఇంగ్లీష్ సిరీస్ (జులై 9)
పతి పత్ని ఔర్ వో దో – హిందీ మూవీ (జులై 10)
షిప్ రెక్డ్: నైట్మేర్ ఎట్ సీ – డాక్యుమెంటరీ (జులై 10)
ది అపార్ట్మెంట్ జాబ్ – కొరియన్ సిరీస్ (జులై 11)
సుసాన అండ్ ఎల్విరా (జులై 12)
అమైజాన్ ప్రైమ్ వీడియోలో..
రేజర్ – తెలుగు మూవీ (జులై 5)
ది వెస్టీస్ – ఇంగ్లీష్ సిరీస్ (జులై 12)
జీ5లో
ఫ్రేమ్ – మరాఠీ మూవీ (జులై 10)
పరిమళ అండ్ కో – తమిళ మూవీ (జులై 10)
సోనిలివ్‌లో
బల్టీ – తెలుగు డబ్బింగ్ మూవీ (జులై 10)
జియో హాట్ స్టార్‌లో
ది ఫైవ్ స్టార్ వీకెండ్ – ఇంగ్లీష్ సిరీస్ (జులై 10)
లయన్స్ గేట్ ప్లేలో..
ది సెంటినల్స్ – ఫ్రెంచ్ సిరీస్ (జులై 10)
యాపిల్ టీవీ ప్లస్..
ట్రైయింగ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్ (జులై 8)
ఈ వారంలో ప్రేక్షకుల దృష్టి మొత్తం ‘పెద్ది’ డిజిటల్ ప్రీమియర్పైనే ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ బ్లాక్‌బస్టర్‌ను ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు. అదే సమయంలో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’, డార్క్ కామెడీ ‘పరిమళ అండ్ కో’, కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ వంటి విభిన్న జానర్ల కంటెంట్ కూడా ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amazon
- netflix
- OTT Movies
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

