KTR | జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఆయిల్‌పామ్ రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఉదయం ముచ్చటించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యమంలా సాగిన ఆయిల్‌పామ్ సాగు, కాంగ్రెస్ పాలనలో కుంటుపడింది. ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేసింది. వంట నూనెల దిగుమతి తగ్గించాలనే ఉద్దేశంతో, 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది.
సాగునీటి విస్తీర్ణం పెంచి.. ప్రోత్సాహకాలు, రాయితీలు అందించి.. ఇండోనేషియా, మలేషియా నుండి అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ విత్తనాలు తెచ్చి.. 46,000 ఎకరాల్లో ఉన్న ఆయిల్‌పామ్ సాగును రికార్డు స్థాయిలో 1.5 లక్షల ఎకరాల్లో విస్తరించింది. కానీ కేసీఆర్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన 30 ఆయిల్‌పామ్ మిల్లులను, ఇతర కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.

Ktr1