చెన్నారావుపేట/నర్సంపేట, డిసెంబర్16 : అధికార మ దంతో చెలరేగిన కాంగ్రెస్ గూండాలు భయానక వాతావరణం సృష్టించి బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్ల తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సో మవారం అర్ధరాత్రి చెరువుకొమ్ముతండా గ్రామ చివరన ఉన్న దుర్గమ్మ గుడి వద్ద పథకం ప్రకా రం కాంగ్రెస్ గూండాలు చలి మంటలు వేసుకొని ఉండగా, అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
తమది అధికార పార్టీ అని, బీఆర్ఎస్ సర్పంచ్ ఎలా గెలుస్తాడో చూస్తాం.. తెల్లారిన తరువాత ఆ పార్టీ కా ర్యకర్తలను ఒక్కడిని కూడా వదలం అం టూ తీవ్రంగా భయపెట్టారు. ఎదురు తిరిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు బోడ వెంకన్న, రెడ్డి శ్రీను, శ్రీనివాస్‌పై విచక్షణారహితం గా నిప్పుల కర్రలతో దాడి చేశారు. అడ్డువచ్చిన మహిళలను కూడా కొట్టినట్లు తెలిపారు. రెడ్యాకు తీవ్ర గాయాలు కాగా నర్సంపేటలోని ఏరి యా ఆసుపత్రికి తరలించారు. బోడ వెంకన్న తలకు, చేతికి గాయాలయ్యాయి. రాత్రంతా భయం గుప్పిట్లో గడిపామని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేసి నట్లు తెలిపారు. కాగా, నర్సంపేటలో చికిత్స పొందుతున్న బాధితులను, తండాలో ఉన్న వారిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీ నాయక్, మాజీ ఎంపీపీ అశోక్ యాదవ్, పార్టీ పట్టణ, మండల అధ్యక్షు లు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, బాల్నే వెంకన్న, నామా ల సత్యనారాయణ, బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్, మాజీ కౌన్సిలర్లు గంధం చంద్రమౌళి, మండల శ్రీనివాస్, ప్రసాద్, స్వామి, రాజుయాదవ్, బద్దూనాయక్, మురళీనాయక్ ఉన్నారు.
ఓటమి భయంతోనే దాడులు : పెద్ది
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ చిల్లర మూకలు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే దొంతి ప్రచారం నిర్వహిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట తప్ప అభివృద్ధిపై ఊసెత్తడం లేదు. ప్రచారంలో ప్రశ్నిస్తున్న వారిపై రౌడీషీట్ నమోదు చేస్తూ, పోలీసులకు హుకుంలు జారీ చేస్తున్నాడు.
గత రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలపై తీవ్ర దాడి జరిగితే, ఇప్పటి వరకు పోలీసు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం దారుణం. ఫిర్యాదు ఇస్తేనే పోలీసులు స్పందిస్తారా? ఇప్పటికే రెండు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. సౌమ్యంగా ఉంటే చేతకాని వాళ్లు అనుకోవద్దు. బీఆర్ఎస్ వాళ్లు ప్రతిదాడులు చేస్తే అధికార నాయకులు తట్టుకోలేరు. చెరువుకొమ్ముతండాలో జరిగిన దాడిలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని, దీనిపై రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం.