మడికొండ, జూలై 11: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా కాజీపేటలో మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తన స్థాయికి మించి వినయ్ భాస్కర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈరోజు అనుభవిస్తున్న పదవి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష అన్నారు. మైనార్టీ పెద్దల వద్దకు వస్తే నీపై జాలిపడి వినయన్న పార్టీలో చేర్చుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు గుర్తు చేశారు. సమావేశంలో మైనార్టీ నాయకులు ఎండీ షఫీ, ఎండీ అఫ్జల్ పాషా, నయీమ్ జుబేర్, మతిన్, పర్వీన్ ఖాన్, దస్తగిర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.