హనుమకొండ/ఖిలావరంగల్, మే 30 : తె లంగాణ కీర్తి ప్రతిష్టకు చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాజ ముద్ర నుంచి తొలగించాలనే సర్కారు నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు లోగో మార్పుపై గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరస న తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ మాట్లాడుతూ రాజముద్రలోని కాకతీయ కళాతోరణం తొలగించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి వెనకి తీసుకోవాలని అన్నారు. కాకతీ య కళాతోరణం తొలగిస్తే వరంగల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లేనన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం లోగో మార్పు నిర్ణయం వెనకి తీసుకోని పక్షంలో పోరాటాలు ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమొద్దీన్, నాయకులు చాగంటి రమేశ్, బొల్లు రవి, ఎండీ మహమూద్, సంపత్, ఇస్మాయిల్, సందీప్, రాజేశ్వర్, అఫ్జల్ పాల్గొన్నారు.