బయ్యారం, మే 1: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బయ్యారంలో ప్రజలు నీరాజనం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బుధవారం కొత్తగూడెం నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా బయ్యారం చేరుకున్న కేసీఆర్‌కు ప్రజలు, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ వస్తున్నారనే విషయం తెలుసుకున్న వేలాది మంది ప్రజలు గ్రామాల నుంచి బస్టాండ్ వద్దకు సాయంత్రం 5గంటలకే చేరుకొని కేసీఆర్ రాక కోసం ఎదురు చూశారు.
మహిళలు, వృద్ధులు, కేసీఆర్‌ను చూసేందుకు వచ్చారు. సాయంత్రం 6గంటలకు కేసీఆర్ కాన్వాయి రాగానే మహిళలు పట్టగా, బస్సుపై పూలవర్షం కురిపించారు. జై బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటూ యువకులు నినాదాలు చేశారు. బస్సులో వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలు సింబల్ చూపుతూ అభివాదం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు మహబూబాబాద్ రోడ్‌షోకు తరలివెళ్లారు.
బయ్యారం : కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రాష్ర్టాన్ని సాధించగా, నేడు ప్రజా సమస్యల పోరాడుతున్నరు. ఇది చూసి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. కేసీఆర్ సారు వస్తున్నాడని తెలుసుకున్న అనేక గ్రామాల ప్రజలు చూసేందుకు రావటంతో మహబూబాబాద్ గులాబీమయంగా మారింది. రోడ్‌షోలో కేసీఆర్ మాటలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కేసీఆరే తెలంగాణకు రక్ష.
– బానోత్ రాజేశ్, సంత్లాల్పోడ్ తండా, బయ్యారం
మహబూబాబాద్ రూరల్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు హామీతో మోసం చేసిండ్రు. వాళ్లకు ఓటు వేసి అరిగోస పడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయటం లేదు. నీళ్లు లేక పంటలు ఎండి పాయె. మళ్లీ బోర్ల రిపేర్‌కు వెళ్లాల్సి వచ్చె. పండిన పంటకు సరైన ధరలేదు. గ్రామాల్లో తాగునీరు లేక అరిగోస రైతులందరూ అప్పులు తీసుకోండి అని రుణమాఫీ చేయకపాయె. పెట్టుబడికి తెచ్చిన అప్పులు పెరిగిపాయె. కేసీఆర్ సార్‌ను చూడాలనే సభకు వచ్చిన. ఈసారి కారుగుర్తుకే ఓటు వేస్తా. మళ్లీ కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేస్తరు.
– ఆర్.నర్సయ్య రైతు, ఆలేరు గ్రామం