సంగెం/హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26 : రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ప్రభబండిని శనివారం సంగెం మండలకేంద్రంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. గుమ్మడికాయ కొట్టి ప్రభబండిని ప్రారంభించిన అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుళ్లు, మహిళలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు ప్రతి గడప నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నారని, మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంట్నుట్లు తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని వదిలివెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ కుమారస్వామి, మాజీ సర్పంచ్‌లు సాగర్‌రెడ్డి, గుండేటి బాబు, కుమారసామ్వమి, మాజీ ఎంపీటీసీలు దొనికెల మల్లయ్య,
సదానందం, మేరుగు వీరేశం, యార బాలకృష్ణ, రాజుయాదవ్, జక్క మల్లయ్య, కోడూరి సదయ్య, మనోహర్, మొగిలి, బుచ్చిరెడ్డి, శరత్‌బాబు, సంపత్, సమ్మయ్య, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. గీసుగొండ, సంగెం మండలాల నుంచి బయలుదేరిన ప్రభబండ్లు శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకోగా, పబ్లిక్ గార్డెన్ వద్ద మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాసర్, చల్లా ధర్మారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ఘనస్వాగతం పలికారు. ఎడ్లబండ్లను నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. దేశ చరిత్రలో కనీవిని ఎరగనిరీతిలో బీఆర్ఎస్ సభ జరుగుతుందన్నారు.