బచ్చన్నపేట జూలై 17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలని, పార్టీ పట్టిష్టతను పెంచాలన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మినలాపురం కనకయ్య, యూత్ అధ్యక్షులు మినలాపురం శివకుమార్, పార్టీ నాయకులు, కరికె కరుణాకర్, ఆత్కూరి కనకయ్య, మల్లం రాజ మల్లయ్య, కందారం కనకచారి, దండుగుల యాదగిరి, ఆత్కూరి రమేష్, చెట్టే ఐలయ్య, మిన్నలాపురం బాలమల్లయ్య, టేకులపల్లి బాబు, పుప్పాల గణేష్, మామిడాల కార్తీక్, చెట్టే శ్రీకాంత్, గంగం దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.