ఐనవోలు, (హనుమకొండ): కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేల్ క్రాస్ వద్ద వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారి పై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల మండల కన్వీనర్ తంపుల మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందదర్రావు మాట్లాడారు.
కాళేశ్వరం పైన కాలయాపన చేసి మొత్తం గోదావరి జలాలను ఆంధ్రకి తీసుకేళ్లే కుట్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ సీబీఐ మోడీ చేతిలో ఉంది అంటుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకీ అప్పగించడం వెనుక పెద్దకుట్ర నడుస్తుందన్నారు. ఈ ధర్నాలో కార్పొరేటర్ రాధికారెడ్డి, ఇంచార్జి పోలెపల్లి రామ్మూర్తి, మాజీ సర్పంచులు ఉస్మాన్ అలీ, పల్లకొండ సురేశ్, మాజీ ఎంపీటీసీ కడ్డూరి రాజు, మాజీ ఉప సర్పంచ్ ఎల్లగౌడ్, నాయకులు జయశంకర్, రాఘవులు, భూపాల్ రెడ్డి, జగపతి, రాకేశ్, శ్రీనివాస్, లక్ష్మణ్, కట్కూరి రాజు, సంపత్ కుమార్, రాజు, అశోక్, రఘువంశీ, నాగరాజు, చందు, లింగారెడ్డి, రాజశేఖర్, ఆజయ్ తదతరులు పాల్గొన్నారు.