కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజజోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించినందుకు గులాబీ దళపతి కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు మంగళవారం ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సభ నిర్వహణపై అధినేత కేసీఆర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఉద్యమ సమయంలోనూ అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశామని వారు చెప్పారు.
రజతోత్సవ మహాసభ కోసం ఎలతుర్తి వద్ద 1,213 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పారింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. 50వేల వాహనాలు పారింగ్ చేసుకునే వీలుంటుందన్నారు. మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 1500 మంది వలంటీర్లను నియమించడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులను అందుబాటులో పెడుతున్నామని చెప్పారు.
– వరంగల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉన్నదని జిల్లా నేతలు తెలిపారు. ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తి తో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని వారు ధీమాగా చెబుతున్నారు. వరంగల్ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన ఉద్యమస్ఫూర్తితో తిరిగి పార్టీ కోసం ప్రజ ల కోసం తమ కార్యాచరణ అమలుచేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సాధన అనంతర కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
తెలంగాణకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఎప్పటికైనా కేసీఆరే శ్రీరామ రక్ష అనేది మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్ ఏర్పాటు చేసి నేతన్నలకు ఉపా ధి కల్పించిందని, అంతర్జాతీయ స్థాయి లో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టారని తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో వరంగల్‌లో 24 అంతస్తుల మల్టీ స్పెషాలి టీ హాస్పిటల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయానికి యునెసో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.
వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. వరంగల్, హనుమకొండ జంట నగరాలను అభివృద్ధి చేస్తూనే మారుమూల ప్రాంతానికి ప్రగతిని విస్తరించిన అంశాలను ఉమ్మడి జిల్లా నేతలు గుర్తుచేశారు. ఐటీరంగంతో పాటు అన్ని రకాల అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్‌ను తీర్చిదిద్దన ఘనత కేసీఆర్‌దేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల పూర్తి, సమ్మక బరాజ్ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరాయని పేర్కొన్నారు.
కాళోజీ కళాక్షేత్రం, వరంగల్‌కు పోలీస్ కమిషనరేట్ హోదా, ఉమ్మడి జిల్లాను పాలనా సౌలభ్యం కోసం ఆరు జిల్లాలుగా ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన బృహత్తర పథకానికి మిషన్ కాకతీయ పేరు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళాతోరణం వంటి వాటితో ఉమ్మడి జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని వరంగల్ ప్రజలు మరువలేరన్నారు. కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించడం మరోసారి అందించడం ద్వారా వరంగల్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ రుణం తీసుకోబోతున్నదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని గాడి తప్పిన తెలంగాణ రైతన్నల సంక్షేమాన్ని, అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు వరంగల్ జిల్లా బిడ్డలుగా ముందువరుసలో ఉంటామని ప్రతినబూనారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేత కేసీఆర్‌కు బహుమతిగా అందజేస్తామని వరంగల్ ఉమ్మడి జిలా నేతలు ముక్తకంఠంతో ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, డి.ఎస్.రెడ్యానాయక్,
మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, ఎ.జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జడ్పీ మాజీ అధ్యక్షులు బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంశీధర్‌రావు పాల్గొన్నారు.