బచ్చన్నపేట నవంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నక్క వానిగూడెం, ఇటకాలపల్లి, రామచంద్రపురం, గోపాల్ నగర్, చిన్న రామంచర్ల, నారాయణపూర్, వీఎస్ఆర్ నగర్ గ్రామాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జీలు ఇర్రి రమణారెడ్డి, చంద్రారెడ్డి, చాలా శ్రీనివాస్ రెడ్డి , ప్రతాప్ రెడ్డి, గంగం సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, బాల్ రెడ్డి, పూర్ణచందర్, బాలచందర్, వడ్డేపల్లి మల్లారెడ్డిలు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి గులాబీ జెండా ఎగుర వేయించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థులుగా కోనేటి వాణిశ్రీ, కొలుగూరి రాములు, పోతుల వెంకటేష్, కల్లూరు స్రవంతి, ఎండీ ఆజాం, కొంతం చంద్రకళ, కళ్యాణిలను బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులుగా ప్రకటించారు.