దుగ్గొండి, ఏప్రిల్ 20: ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు ప్రజలంతా స్వచ్ఛంగా తరలివచ్చి విజయవంతం చేయాలని దుగ్గొండి మండల క్లస్టర్ ఇంచార్జ్ కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గిర్ని బావి, మందపల్లి, పీజీ తండా, వెంకటాపురం, రేకంపల్లి, మహ్మదపురం, శివాజీ నగర్ గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీగా భావించి మండలం నుంచి బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివెల్లి విజయవంతం చేయాలని కార్యకర్తలు, ప్రజలను కోరారు.
వడగండ్ల వర్షం కురిస్తే పంట నష్టపరిహారం చెల్లించి రైతు పక్షపాతిగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి రైతులు, కర్షకులు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకిని రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, పార్టీ నేతలు బండి జగన్, కాట్ల కోమల భద్రయ్య, ఉరాటి రవి, పాండవుల సురేష్, దొనపాటి జనార్దన్ రెడ్డి, గొర్రె శ్రీనివాస్, లింగాల రమేష్, మొగ్గ మహేందర్, రాజు నాయక్, మాజీ ఎంపిటిసి రంపిసొనీ రతన్, కొత్తపల్లి శంకర్, ఇమ్మడి యుగంధర్, మాతంగి భరత్, కొల్లూరి మోహన్ రావు, మోడం విద్యాసాగర్, సద్ది ఐల్ రెడ్డి, అనుముల రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.