మహదేవ్పూర్, జూలై 14: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘బహుజనగణమన’ పుస్తకాన్ని సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మహదేవ్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలూరి గౌరీ శంకర్ బహుజనగణమన పుస్తకంలో బహుజనుల సాధక బాధకల పైన అనాదిగా బహుజనలు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు కవితా సంపుటిలో వివరించారన్నారు. తరాలు మారుతున్న తలరాతలు మారని జాతులు ఏవైనా ఉన్నాయంటే అవి బహుజనులేనని, ఇప్పటికైనా మన స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కుల కోసం ఐక్యమత్యంతో పోరాడుదామని ఆయన రాసిన రచనలు బహుజనులు నూతన ఉత్తేజాన్ని నింపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహదేవ్పూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, మండల సీనియర్ నాయకులు అంకారి ప్రకాష్ ,పెండ్యాల మనోహర్, బీఆర్ఎస్ సమ్మయ్య, మండల యూత్ అధ్యక్షుడు యండీ అలీమ్ ఖాన్, మంథని డివిజన్ మహిళ అధ్యక్షురాలు గీత బాయి, బీఆర్ఎస్ నాయకులు వెన్నేంపల్లి మహేష్, మాజీ ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, తలారి గట్టయ్య, శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కారెంగుల బాపు రావు, యూత్ టౌన్ అధ్యక్షుడు రెవెళ్లి రాజశేఖర్, ఇస్తాయక్, అన్వర్, మల్లేష్, అయిల్లా సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.