హనుమకొండ సబర్బన్, మార్చి, 26 : ఏప్రిల్ 27వ తారీఖున నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ వేడుకలకు హనుమకొండ జిల్లా ఎలుకతుర్తిలో సభా స్థలాన్ని పార్టీ నాయకులు ఎంపిక చేశారు. మండల కేంద్రంలోని ముల్కనూర్ రోడ్డులో విశాలమైన స్థలాన్ని గుర్తించారు. ఈ మేరకు పార్కింగ్ స్థలాన్ని ఇతరత్రా మార్గాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, సుదర్శన్ రెడ్డి, సభా స్థలాన్ని ఇతర మార్గాలను స్వయంగా తిరిగి పరిశీలించారు.
సర్వేయర్లతో సర్వే చేయించి మ్యాపులు కూడా సిద్ధం చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రంలోని సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను లక్షలాది మందితో వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 7న నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎలుకతుర్తిలో సభా స్థలాన్ని పరిశీలించారు.