తుంగతుర్తి, ఫిబ్రవరి 12 : యాసంగి పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. సాగు సమయం మించుతున్నా నిధులు జమ చేయకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో పలువురు నాయకులు, సర్పంచులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్. సర్పంచులు తప్పేట్ల యెల్లయ్య, మాతంగి వెంకటమ్మ కరుణాకర్, గాజుల యాదగిరి, అంగోతు నరేష్, మల్యాలా రాములు, గుడిపాటి వీరయ్య, కడారి దాసు, మట్టిపెల్లి వెంకట్, గోపగాని రమేష్, యాకూబ్, శ్రీనివాస్, రాములు, జటంగి రవి, పాందవుల మహేష్, సిమ్మాద్రి, కరుణాకర్, భాస్కర్, రమేష్, వెంకన్న, ఉప్పుల నాగమల్లు, కొండగడుపుల నాగయ్య, సోమేశ్, జూనీ పాల్గొన్నారు.