జనగామ రూరల్, ఏప్రిల్22 : ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ మండల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వారికి పార్టీ జెండాలు, కండువాలు, పార్టీ సామగ్రి అందజేశారు.
ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్లలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించిన కేసీఆర్ గొప్ప పాలకుడని తెలిపారు. పాతికేళ్ల సంబురాన్ని మనందరం కలిసి విజయవంతం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా, గ్రామ శాఖ అధ్యక్షుడు చినబోయిన నరసయ్య, ఐలయ్య, డానియల్, మాజీ సర్పంచులు సానబోయిన శ్రీనివాస్, వినోద్, నాయకులు సంతోష్, సంపత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.