పరకాల/శాయంపేట/హసన్‌పర్తి, మార్చి 1 : ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పరకాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఆయనకు మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు మడికొండ శ్రీను, చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నడికూడ మండలాధ్యక్షుడు ధూరిశెట్టి చంద్రమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, మంత్రి కేటీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సన్మానించారు. మాందారి పేట స్టేజీ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మేడిగడ్డకు వెళ్తున్న సందర్భంగా హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో నాగుర్ల వెంకటేశ్వర్లు, ఎల్లావుల లలితాయాదవ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట, మార్చి 1: నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మేడిగడ్డకు తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు మండలాల నుంచి భారీగా తరలివెళ్లారు. బీఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు రాయిడి దుష్యంత్రెడ్డితోపాటు నాయిని వేణుచంద్, బీరం అనంతరెడ్డి, గొడిశాల అనిల్, గణేశ్ తదితరులు తరలివెళ్లారు.