హనుమకొండ, డిసెంబర్ 9 : షాద్‌నగర్ ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెల మ కులస్తులు మండిపడ్డారు. తమ జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం హ నుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో తోపులాట జరిగి ఉద్రిక్త వా తావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉషా దయాకర్‌రావు మాట్లాడుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలమలను ఎవరుపడితే వారు విచ్చలవిడి గా మాట్లాడితే ఊరుకోమన్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయనను తిట్టినా ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. సమాజ సేవ లో వెలమలు ముందుంటారని, ఉన్నదాం ట్లో ఇతరులకు సహాయం చేసిన చరిత్ర వా రికి ఉందన్నారు. వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రావు మాట్లాడు తూ వెలమ జాతిని తొకేస్తామని, చంపేస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే బెదిరించారని, ఇలాంటి మాటలు సరికాదని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఎమ్మెల్యే శంకర్ క్షమాపణ చెప్పకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వెనుక ఉండే మాట్లాడిస్తున్నారని అన్నారు. ‘మమ్ములను షాద్‌నగర్‌కు రమ్మంటావా.. నీవు వరంగల్‌కు వస్తావా’ అని ఎమ్మెల్యే శంకర్‌కు సవాల్ విసిరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బోయినపల్లి రంజిత్‌రావు, తక్కళ్లపల్లి రవీందర్రావు, కేశవరావు, వెంకటేశ్వర్రావు, దుర్గారావు, ఉపేందర్‌రావు, దేవేందర్‌రావు పాల్గొన్నారు.