బచ్చన్నపేట ఏప్రిల్ 17 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు గ్రామాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే గురువారం బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం కోరుతూ వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో నేతలు పోస్టర్లు అంటిచే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాల పురిటి గడ్డ అయిన బచ్చన్నపేట మండలం నుంచి సభకు గులాబీ సైన్యం వేలాదిగా తరలి రావాలని ఆయన కోరారు.
ప్రతి పల్లె గులాబీ వనం కావాలని సూచించారు. సభకు ప్రజలను రైతులను యువకులను మహిళలను పెద్ద ఎత్తున సమాయత్తం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆలింపూర్, కట్కూర్, కొన్నె, కొడవటూర్, రామచంద్ర గూడెం, ఇటికాలపల్లి, విఎస్ ఆర్ నగర్, నారాయణపూర్, చిన్న రామంచర్ల, పోచన్నపేట, బచ్చన్నపేట గ్రామాల్లో విస్తృతంగా పోస్టర్లు అంటించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నేతలు ఇర్రి రమణారెడ్డి, మల్లారెడ్డి, బాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఆజాం, కోనేటి స్వామి, కనకయ్య గౌడ్, మల్లేశం, నరేందర్, ఉపేందర్, షబ్బీర్, జావీద్, శ్రీనివాస్, కరుణాకర్ రెడ్డి, బాలయ్య, నరసింహులు, ఫిరోజ్, కిష్టయ్య,సిద్ధారెడ్డి, జోగి రెడ్డి, ముసిని రాజు గౌడ్, రాజనర్సు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.