నల్లబెల్లి, జూన్ 08 : గొల్లపల్లిలోని స్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, మండలంలోని గొల్లపల్లి గ్రామ స్మశన వాటికకు వెళ్లడానికి రోడ్డులేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల సమస్యలను గుర్తించిన సారంగపాణి తన వంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందించారు.
ఈ మేరకు గ్రామస్తులు సారంగపాణికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పిండి కుమార స్వామి, ఎర్ర కృష్ణయ్య, దాసి రాజకుమార్, కూస కళింగరాజు, శ్రీపతి కొమురయ్య, చల్ల రాజయ్య, లేంకాల సాయిలు, సింగరా బోయిన కట్టయ్య, కర్టూరి సురేందర్, ఇమ్మడి రమేష్, పొన్నాల యుగేందర్ పాల్గొన్నారు.