దుగ్గొండి, మే 30 : మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బైగాని వీరస్వామి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి.. వీరస్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతరం పాత్రికేయ రంగంలో వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, నాతి వెంకటేశ్వర్లు, గుండెకారి రవీందర్, జోగ్యా నాయక్, కుస రాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.