కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలకు మంగళవారం క్షీరాభిషేకం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ తల్లి వద్దు.. తెలంగాణ తల్లి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత చర్యలను ఖండించారు. తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు.
– నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 10
మరిపెడ : తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
భూపాలపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి నినాదాలు ఇస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు
హనుమకొండ: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు