Banoth Shankar Naik | నెల్లికుదురు, జూన్ 27 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో బానోత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చిందని ప్రస్తుతం వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని అందిపుచ్చుకొని మెజార్టీగా బీఆర్ఎస్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. ఇందుకోసమే ప్రతి కార్యకర్త బార్డర్లోని సైనికుడిలా పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్లు గుండా వెంకన్న, కాసం లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేనాకుల శ్రీనివాస్, నాయకులు కాసు వెంకటేశ్వర్ రెడ్డి, పులి రామచంద్ర, గొట్టిముక్కల ఆది రెడ్డి, వీరగాని మల్లేశం, బానోతు భీముడు, బత్తిని అనిల్ గౌడ్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.