warangal | కాశీబుగ్గ జూన్ 20: వ్యాపారంలో నమ్మి క్యాష్ కౌంటర్ పై ఉంచినందుకు రూ.కోటి రూపాయలకు పైగా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న చల్ల సంపత్ పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చల్ల సాంబలింగం అనే బాధితుడు అధికారులను వేడుకున్నారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు చల్ల సాంబలింగం మాట్లాడారు. తాను తన తమ్ముడు చల్ల సంపత్ తో కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో 2016నుండి కేశవ ట్రేడర్స్ పేరుతో మిర్చి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో తాను బయట విషయాలు చూసుకుంటుండగా తన తమ్ముడు చల్ల సంపత్ క్యాష్ కౌంటర్ పై కూర్చుని ఆర్థిక లావాదేవీలు చూసేవాడని అన్నారు. ఈక్రమంలో వ్యాపారంలో వచ్చిన రూ.24 లక్షల లాభం, 12లక్షల తక్ పట్టీల డబ్బులు 37లక్షల నగదు, ప్లాట్ల వ్యాపారంలో మరో 83 లక్షల రూపాయలు తన సొంతానిక వాడుకున్నారని అన్నారు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే తాను డబ్బులు ఇవ్వనని డబ్బులు అడిగితే మిమ్మల్ని చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. దీంతో తాము చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రెటరీ చక్రపాణి వద్దకు వెళ్లగా, అతను పంచాయితీ నిర్వహించి తన తమ్ముడి నుండి తనకు రూ.20 లక్షల విలువ చేసే భూమి, రైతుల వద్ద నుండి రావలసిన మరో 10లక్షలు వచ్చేటట్లు తీర్మానం చేశారని అన్నారు.
ఈపంచాయితీ తనకు నచ్చకపోవడంతో తాను మూడు నెలల క్రితం ఏనుమాముల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి చక్రపాణి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పంచాయతీ తీర్మాన పత్రాన్ని పోలీసులకు చూపించగా పోలీసులు సైతం పెద్దలు చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండాలని అంటున్నారని అన్నారు. దీంతో తాము విషయాన్ని అర్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డి వద్దకు వెళ్లగా లింగారెడ్డి సైతం చక్రపాణి చేసిన తీర్మానం ప్రకారమే నేర్చుకోవాలని లేని యడల నీ ఇష్టం ఉన్న చోటు చెప్పుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వ్యాపారం కోసం అప్పుగా రూ.45 బ్యాంకులో, తెలిసిన వారి వద్ద నుండి మరో 45 లక్షలు అప్పుగా తీసుకున్నానని అన్నారు. తమ కూతురికి కట్నంగా ఇచ్చిన ఫ్లాట్ సైతం బ్యాంకులో కుదవబడి ఉందని తనకు రావలసిన డబ్బులు ఇవ్వాలని తన తమ్ముడిని ఎంత ప్రాధేయపడిన కనీస కనికరం చూపించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తన తమ్ముడి నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణ భయం ఉన్నందున చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పోలీసులు, జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని లేనిదే తమ కుటుంబానికి ఆత్మహత్యలే శరణ్యమని వేడుకున్నారు.