హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1: కాకతీయ యూనివర్సిటీ రాజనీతిశాస్త్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16, 17 తేదీలలో ‘సరళీకరణ అనంతరం భారతదేశంలో జన రంజక విధానాలు’ అనే అంశం జరిగే రెండు రోజులు జాతీయ సెమినార్ బ్రోచర్‌ను కేయూ వీసీ కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ 1947 భారతదేశానికి స్వాతంత్రం అనంతరం ప్రవేశపెట్టిన మిశ్రమ ఆర్థిక విధానాలు ప్రజలకు సరైన అభివృద్ధికి తోడ్పడకపోవడం వలన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాలు అనుగుణంగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేయడం జరిగిందన్నారు.
భారతదేశం ప్రభుత్వ రంగానికి బదులుగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నది మరోవైపు ఈ ప్రైవేటు రంగాన్ని మైమర్పించడానికి అభివృద్ధికి అవకాశంలేని ప్రజారంగక విధానాలను అమలుచేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయని ఈ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో ఉన్న యూనివర్సిటీలు ఈ సెమినార్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఒక విధాన రూపకల్పన తయారుచేసి పంపించాలని ఇంత మంచి సెమినార్‌ను ఏర్పాటు చేస్తున్న రాజనీతి శాస్త్ర అధ్యాపక బృందానికి వీసీ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో యుజిసి కోఆర్డినేటర్ రాగడి మల్లికార్జునరెడ్డి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్బానోతు సురేష్ లాల్, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి మనోహర్, కంట్రోలర్ కట్ల రాజేందర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి సంకినేని వెంకటయ్య, బీవోఎస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య, అధ్యాపకులు వడ్లకొండ సత్యనారాయణ, నాగరాజు వాడపల్లి, లలితకుమారి, భాగ్యమ్మ, సంజీవ్, లక్ష్మీనారాయణ, సోమలింగం, కళ్లేపల్లి ప్రశాంత్, గుండు సురేష్, రాజనీతిశాస్త్ర రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.