గీసుగొండ, ఏప్రిల్ 7: వంటకు ఉపయోగించే బొగ్గు మింగి ఓ బాలుడు మృతిచెందాడు ఈ ఘటన గీసుగొండ మండలం విశ్వనాథపురంలో సోమవారం జరిగింది. సీఐ మహేందర్ తెలిపి న వివరాల ప్రకారం.. కొర్ర రాజు-శ్రీలత దంపతులకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు అయా న్(9 నెలలు) జన్మించాడు. రాజు కొమ్మాల స్టేజీ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ నెల 5న తల్లి శ్రీలత కొడుకును తీసుకొని బిర్యానీ సెంటర్‌కు వెళ్లింది. దంపతులు వంట చేస్తుండగా బాలుడు ఆడుకుంటూ వెళ్లి పొయ్యి వద్ద ఉన్న బొగ్గును మింగాడు. తల్లి దండ్రులు నర్సంపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఎక్స్‌రే తీసి ఊపిరితిత్తుల్లో బొగ్గు ఇరుక్కుందని ఆపరేషన్ చేయాల ని వైద్యులు చెప్పారు. వెంటనే హైదరాబాద్ నిలోఫర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.