వరంగల్ చౌరస్తా : వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. సరైన విధంగానే ఈ వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిపిందన్నారు. 2025 -26 వార్షిక బడ్జెట్ పరిశీలించిన ప్రతిపక్షాలకు భయం పట్టుకుంన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడంతో ఎందరికో లబ్ధి చేకూరిందన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపు భారత్ పైనే ఉందని అన్నారు. అంబేద్కర్‌ను అన్ని విధాల గౌరవించటానికి పంచ తీర్థాలను అభివృద్ధి చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కులగణన పేరుతో బీసీల్లో ముస్లింలను కలిపి రిజర్వేషన్లలో కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఆయన మాట్లాడుతూ పర్ఫార్మెన్స్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.